ఒకే వేదిక‌పైకి అద్వాని, మోడి

 

ప్రదాని అభ్యర్ధిగా మోడి ప్రక‌ట‌న‌ల‌తో కినుక వ‌హించిన అద్వాని శాంతిస్తున్నట్టుగా స‌మాచారం.ఇప్పటి వ‌ర‌కు అద్వాని ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నా ఆయ‌న అల‌క తీర్చడానికి బిజేపి అగ్రనేత‌లు చేస్తున్న ప్రయ‌త్రాలు ఫ‌లిస్తున్నట్టుగా క‌నిపిస్తున్నాయి. బిజెపి పార్టీ ఎప్పుడు అద్వాని సార‌ధ్యంలోనే న‌డుస్తుంద‌ని రాజ్‌నాధ్ వ్యాఖ్యనించ‌గా, అద్వానికి ఎలాంటి అసంతృప్తి లేద‌న్నారు సుష్మా.

మోడి ప్రక‌ట‌న‌తో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారాయి. అదే స‌మ‌యంలో అద్వాని రాజ్‌నాధ్‌కు లేఖ రాయ‌డంలో అద్వాని మ‌రోమారు అస్త్రస‌న్యాసానికి దిగుతున్నట్టుగా కూడా వార్తలు వ‌చ్చాయి.  అయితే అలాంటి వాద‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ బిజెపి పెద్దలు అద్వానిని బుజ్జగించే ప్రయ‌త్నం చేశారు.

ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అద్వానీని శాంతపర్చేందుకు అన్నిర‌కాలుగా ప్రయ‌త్నించారు. అద్వాని ఎప్పటికి బిజెపి అగ్రనేతే అన్న రాజ్‌నాధ్ ఆయ‌న‌కు మమ్మల్ని తిట్టే హ‌క్కు కూడా ఉంటుంద‌ని చెప్పారు. భ‌విష్యత్తులో కూడా ఆయ‌నే మ‌మ్మల్ని ముందుడి న‌డిపిస్తార‌ని, భోపాల్‌లో జ‌ర‌గ‌బోయే స‌భ‌లో అద్వాని మోడిలు ఒకే వేదిక పంచుకోనున్నార‌ని ప్రక‌టించారు.