TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ లో 'అల్లోల' కల్లోలం

Published on: Wed May 2, 2012 9:52AM

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్లమెంట్ మాజీ సభ్యుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణమయ్యారు. చాలాకాలంగా పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని ఘాటుగా విమర్శించారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనలాంటి నాయకులకు పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

అల్లోలతో పాటు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా తన సహచరులతో కలిసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించటానికి ప్రయత్నిస్తోంది. సుమారు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఇంద్రకరణ్ రెడ్డి పార్టీని వీడితే తెలంగాణా వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధిష్టానం భయపడుతోంది. అందుకే చర్చలకు ఢిల్లీ రావాల్సిందిగా ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థించింది. అయితే అల్లోల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకున్నట్లు కనిపించటం లేదు.