ప్రచారంలో ముందున్న పాయల్ శంకర్
Published on: Fri Mar 9, 2012 10:09AM
ఆది
లాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి పాయల్ శంకర్ ప్రచారంలో మిగతా అభ్యర్ధులకన్నా ఎంతో ముందున్నారు. ఆయనకు ఎన్నికల ఇన్ ఛార్జి, పార్లమెంట్ సభ్యుడు అయిన రమేష్ రాథోడ్ పలువురు శాసనసభ్యులు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ పటిష్టమైన వ్యూహాలతో గడప గడపకు వెళ్ళి ప్రచారం చేస్తోంది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 73 గ్రామ పంచాయితీలు, ఆదిలాబాద్ పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయితీలు, వార్డులకు 15 మంది చొప్పున ప్రచార బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు ప్రతిరోజూ అన్ని గ్రామాల్లో ఉదయం, సాయంత్రం ఇంటింటికీ వెళ్ళి టిడిపికి ఓటువేయాలని ప్రజలను కోరుతున్నాయి. ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఐదుగురు పరిశీలకులను నియమించారు. అంతేకాక మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఒక సీనియర్ నేతను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.


