నేను గెలిస్తే ఎమ్మెల్యే క్వార్టర్ ప్రజలకే
Published on: Sat Mar 3, 2012 10:15AM
ఆదిలాబాద్ టిడిపి అభ్యర్ధి పాయల్ శంకర్
ఆది
లాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పాయల్ శంకర్ ఎన్నికల ప్రచారంలో కొత్త అస్త్రాన్ని సందించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్ కేటాయిస్తామని, ఆ క్వార్టర్ ను నియోజకవర్గ ప్రజలకే అప్పగిస్తానని ప్రకటించారు. అక్కడ సిబ్బందిని కూడా పెడతానని, నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడే ఉండవచ్చునని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అంతేకాక తాను గెలిస్తే ఎమ్మెల్యే గౌరవ వేతనం కూడా తీసుకోనని ఆయన ప్రకటించారు. ఇంటింటికి వెళ్ళి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న పాయల్ శంకర్ తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. వాడ వాడనా శుద్ధ జల ప్లాంట్ ఏర్పాటుచేసి రూపాయికే 20 లీటర్ల క్యాను సరఫరా చేస్తానని మరో వాగ్దానం చేశారు.


