TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓపెన్ కాస్ట్ గనులపై రణం

Published on: Sat Feb 18, 2012 3:07PM

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని  దెబ్బతీసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు మాకు వద్దు అనే నినాదంతో ఈ సంఘాలు ఉద్యమించబోతున్నాయి. తూర్పులోని కోల్ బెల్ట్ ప్రాంతాలైన ఇందారం, రామకృష్ణా పూర్, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాశీపేటలో సింగరేణి యాజమాన్యం ప్రతిపాదించిన 14 ఓపెన్ కాస్ట్ గనులకు స్థానిక ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ గనుల వల్ల విధ్వంసమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఓపెన్ కాస్ట్ పేరుతో పంట పొలాలు, ఊళ్ళను ధ్వంసం చేస్తున్నారని ఉద్యమకారులు అంటున్నారు. గనుల తవ్వకం లో భాగంగా జరిపే పేలుళ్ళ వల్ల గర్భస్థ శిశువులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.