TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ఉప' పోరుకు ఆదిలాబాద్ సిద్ధం

Published on: Fri Feb 17, 2012 2:09PM

    కాంగ్రెస్, బిజెపిలకు అభ్యర్ధులు కరవు
ఆదిలాబాద్:  మూడునెలలుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్దమైంది. మార్చి 18న ఓటింగ్, 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ పోరులో బరిలోకి దిగునున్న తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కాంగ్రెస్, బిజెపి తరపున పోటీచేయనున్న అభ్యర్థులపై ప్రతిష్టంభన నెలకొంది. తెలంగాణాకు మద్దతుగా ఇక్కడనుంచి గెలిచిన జోగు రామన్న రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణా అంశానికి మద్దతు తెలుపుతూ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటానని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సి. రామచంద్రారెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో ఆయన బదులు మరో నేతకు టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానం భావించినా సరైన వ్యక్తి దొరకక పోవడంతో డోలాయమానంలో పడింది. చివరకు పార్టీ పరువును కాపాడటానికైనా పోటీచేసి తీరాలని, ఈ ఎన్నికల్లో గెలుపొందితే మంత్రి పదవి తప్పకుండా ఇస్తామన్న ప్రతిపాదనను పార్టీ అధిష్టానం రామచంద్రారెడ్డి ముందు పెట్టినట్లు  తెలుస్తోంది. బిజెపి విషయానికొస్తే ఆ పార్టీ విధానం తెలంగాణాకు అనుకూలంగా ఉన్నప్పటికీ పోటీ చేయడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు.