TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోదావరిని మింగేస్తున్న గుత్తేదార్లు

Published on: Wed Feb 15, 2012 4:00PM

ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకం
 రూ.146 కోట్ల విలువైన ఎత్తిపోతల పధకాలు నాశనం

ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోని ఇసుకను కొందరు గుత్తేదారులు ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న వీరికి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు అధికార పార్టీ ప్రతినిధులు బహిరంగంగానే మద్దతు పకుకుతున్నారు. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలోని గోదావరి తీరప్రాంతంలో ఈ దోపిడీ పగలూ రాత్రి అనే తేడా లేకుండా నిరాటకంగా అనేక నెలలుగా సాగుతోంది. కాంట్రాక్టు పొందిన  గుత్తేదారులు నదిలో ఒక మీటరు లోతుకు మించి ఇసుక తవ్వకూడదు, కానీ గుత్తేదారులు శక్తివంతమైన ప్రోక్లైన్లతో దాదాపు ఐదారు మీటర్ల లోతువరకు ఇసుకను తీసి వందలాది లారీల ద్వారా తరలిస్తున్నారు. లోతుగా ఇసుక తీసివేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గోదావరి తీరప్రాంత ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. జైపూర్ మండలంలోని శివ్వారం, పౌనూరు గ్రామాలకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గోదావరి నదిలో కిష్టాపూర్ శివారు ఇసుక క్వారీని నల్గొండజిల్లా చందూరు మండలం గట్టుప్పల్ కు చెందిన గుత్తేదారు 2009లో కోటిన్నర రూపాయలకు టెండరు దక్కించుకున్నాడు. నిబంధనల మేరకు ఒక మీటరు లోతు, వందమీటర్ల వెడల్పు, 500 మీటర్ల పొడవుతో ఇసుకను తవ్వాల్సి ఉండగా గుత్తేదారు ఆరు మీటర్ల లోతు వరకు తవ్వడమే కాకుండా 500 మీటర్ల వెడల్పుతో ఇసుకను తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.98కోట్ల వ్యయంతో కిష్టాపూర్ లో 3000 ఎకరాలకు, శివ్వారంలో రూ.48కోట్లతో 2500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు మంజూరు చేసిన ఎత్తిపోతల పథకం ఈ అక్రమ తవ్వకాల కారణంగా వృధా అయ్యింది. ఇసుక అక్రమ తవ్వకాలవల్ల ఎత్తిపోతల పధకానికి నీరులేకుండా పోయింది. ఒకవైపు రైతులకు పీడిస్తూ మరోవైపు కోట్లాది రూపాయల ప్రభుత్వ పథకాలను నాశనం చేస్తూ స్వలాభంకోసం కోట్లు ఆర్జిస్తున్న ఇసుక క్వారీ గుత్తేదారుల ఆగడాలను అపవలసిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.