TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదిలాబాద్ పోలీసులకు ఉచిత విద్యుత్?

Published on: Tue Feb 14, 2012 2:46PM

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ క్వార్టర్లకి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందా? నిజానికి ఇటువంటి జిఓ లేవీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఈ జిల్లాలోని పోలీస్ క్వార్టర్లలో నివసిస్తున్నవారెవ్వరూ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. కూలీ పని చేసుకుని పేదలనుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు పోలీసుల నుంచి బిల్లులు వసూలు చేయడానికి భయపడుతున్నారు. మంచిర్యాల పట్టణం పోలీస్ క్వార్టర్లలో నివసిస్తున్నవారు 2004 నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలో కూడా పోలీస్ క్వార్టర్లలో నివసిస్తున్నవారు ఏడాదిగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారులకు ఇచ్చేందుకు, బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ కి వెళితే బెదిరింపులు వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.బిల్లుల కోసం వస్తే బావుంటుందంటూ తమ సిబ్బందిని బెదిరిస్తున్నారని విద్యుత్ శాఖాధికారి ఒకరు తెలిపారు.