TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశం అకౌంట్ లో 'అధినాయకుడు' ఖర్చు?

Published on: Fri Jun 1, 2012 9:51AM

Adhinayakudu movie, Adhinayakudu balakrishna, TDP Adhinayakudu, telugu desam partyబాలకృష్ణ హీరోగా విడుదలకు సిద్ధంగా ఉన్న అధినాయకుడు చిత్ర ఖర్చులను ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశంపార్టీ ఖాతాలో ఖర్చుకింద చూపే అవకాశాలున్నాయి. ఆ చిత్రంలో అసలు తెలుగుదేశంపార్టీ భావాలకు అనుగుణంగా ఏమైనా తీశారో లేదో పరిశీలించేందుకు ఎలక్షన్ కమీషన్ నడుం బిగించింది. అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే మాత్రం దానిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చిత్ర విడుదల తేదీని, ఖర్చును పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ చిత్రం పూర్తిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని విమర్శించే విధంగా ఉందని ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలానే కాంగ్రెస్ పై కూడా విమర్శనాస్త్రాలుండొచ్చని సమైక్యాంధ్రవాసులు భావిస్తున్నారు. ఈ రెండు తరహాలలో కనుక చిత్రం నిర్మించినట్లు అనిపిస్తే ఆ చిత్రానికి అయిన ఖర్చును తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చుగా ఎలక్షన్ కమీషన్ గుర్తిస్తుంది.