ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ రావు మృతి
Published on: Thu Jan 14, 2016 1:33PM

ప్రముఖ తెలుగు కవి అద్దేపల్లి రామ్మోహనరావు (80) ఈ రోజు కన్నుమూశారు. చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న అద్దేపల్లి రామ్మోహనరావు బుధవారం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అద్దేపల్లి రామ్మోహనరావు 40కి పైగా గ్రంథాలను రచించారు. తెలుగులో మినీ కవిత్వాన్ని రామ్మోహనరావు ప్రోత్సహించారు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. కాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చింతగుంటపాలెం గ్రామంలో రామ్మోహన రావు జన్మించారు.


