గోవాలో ఎంజాయ్ చేస్తున్న భామ
Published on: Sat Nov 16, 2013 10:30AM

నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హార్ట్ ఎటాక్". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ విరామ సమయంలో గోవా అందాలను బాగానే ఎంజాయ్ చేస్తుందట హీరోయిన్ ఆదాశర్మ. ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్ బ్యానర్ లో పూరి స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


