తమన్నాకి కుక్క దొరికింది
posted on: Sep 1, 2014 5:03PM

ప్రపంచ ప్రజలకు ఒక విజ్ఞప్తి. హీరోయిన్ తమన్నాకి రోడ్డు మీద ఒక ఖరీదైన కుక్క దొరికింది. ఆ కుక్కకు సంబంధించిన వారు వచ్చి సదరు కుక్కను తీసుకెళ్ళగలరు. అవును.. ముంబై సబర్బన్‌లోని దక్షిణ ఖార్‌లో తమన్నాకు తప్పి పోయిన ఓ పెంపుడు కుక్క కనిపించింది. అది చాలా ఖరీదైన స్పానియల్ జాతికి చెందిన కుక్క. తమన్న ఆ కుక్కను చేరదీసింది. ఇంటికి తీసుకెళ్ళింది. ఆ కుక్కను దాని యజమాని దగ్గరకు చేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఎవరిదో పెంపుడు కుక్క తప్పిపోయింది... దాని యజమాని గుర్తించినట్లయితే సంప్రదించాలని సదరు కుక్క ఫొటో, ఫోన్ నెంబర్‌తో ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేసింది.







