TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీలో చేరిన మాధవీలత....అందరూ షాక్..

Published on: Sat May 5, 2018 5:28PM


హీరోయిన్ మాధవీలత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని అని అందరికీ తెలిసిందే. అంతేకాదు అవకాశం ఇస్తే పార్టీ తరపున సేవ చేయడానికి కూడా సిద్దమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆమె చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ మాధవీలత చేసిన పనేంటి అని అనుకుంటున్నారా...? అదేంటంటే... ఈరోజు ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన మాధవీలత ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.