కాజల్ 'లవ్ ఫెయిల్యూర్'
Published on: Wed Apr 3, 2013 4:37PM

టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ లవ్ లో పడి మోసపోయిందట! వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇది మాత్రం నిజం అని చెబుతోంది హీరోయిన్ కాజల్. కాలేజిలో చదివే రోజుల్లో తాను తోటి విద్యార్ధితో ప్రేమలో పడి మోసపోయానని చెప్పింది. ఆ సంఘటన తరువాత తాను ఎవ్వరిని ప్రేమించలేదని అంటోంది. ''జీవితం లో ప్రేమ ఒక భాగము మాత్రమే...ప్రేమలో పడి ఎవ్వరు జీవితాలు నాశనం చేసుకోవద్దు'' అని మెసేజ్ ఇచ్చింది కాజల్. జీవితంలో సెటిలాయ్యాకే ప్రేమ..పెళ్ళి గురించి ఆలోచించాలని ముందే డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' లో నటిస్తోంది. తన గ్లామర్ ఈ సినిమాకి మేజర్ అసెట్ గా నిలువనుందని సమాచారం. ఈ సినిమాలో కాజల్ జానకిగా కనిపించనుంది.


