బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. సిట్ విచారణకు దేవరకొండ
Published on: Tue Nov 11, 2025 4:05PM
.webp)
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండకు సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల మేరకు విజయ్ దేవరకొండ మంగళవారం (నవంబర్ 11) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
సిట్ అధికారులు విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు విజయ్ దేవరకొండకు అందిన పారితోషకం, కమిషన్లపై ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఇదే కేసు విషయంలో సిట్ పలువురిని విచారించిన సంగతి తెలిసిందే.


