వైఎస్ జగన్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను : శ్రీహరి

 

 

 actor srihari, jagan sri hari, ysrcongress srihari

 

 

ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో శ్రీహరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే శ్రీహరి జగన్ పార్టీలో చేరతారని, ఆ విషయం జగన్ చెవిన వేసేందుకే ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు.

 


జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్కే ఉందని శ్రీహరి తెలిపారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని, జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.