TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సేవలో సోనూసూద్

Published on: Mon Jun 2, 2025 9:48AM

ప్రముఖ నటుడు సోనూసూద్ సోమవారం (జూన్ 2) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మంటపంటో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో  మాట్లాడిన సోనూ సూద్..  సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు అయ్యిందని తెలిపారు. కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.  అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.