TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విపక్షాలకు సవాల్ విసిరిన శివాజీ

Published on: Mon Jul 30, 2018 2:39PM

విభజన అనంతరం ప్రత్యేక హోదాపై తన వాదనను వినిపిస్తూ,కేంద్రపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నవ్యక్తి సినీ నటుడు శివాజీ.'మేధావుల మౌనం - సమాజానికి శాపం' అనే అంశంపై ఆదివారం గుంటూరు లో కమ్మజనసేవా సమితి బాలికల వసతిగృహ సముదాయంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ ఏపీ విపక్ష నేతలు జగన్.. పవన్ లను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ రాష్ట్రంలో బస్సులు ఆపటం కాదు...ధైర్యం ఉంటే రండి...రైల్వే ట్రాక్‌లపై కూర్చుందాం...కేంద్ర సంస్థల కార్యకలాపాలు ఆపుదాం" అని సవాల్ విసిరారు.

 

 

ప్రజలను కులాల పేరుతో విభజించి..రాష్ట్రంలో అనుచిత వాతావరణాన్ని నెలకొల్పటానికి కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని తప్పు పట్టారు.ఇందులో భాగంగానే రామాయణంపై వ్యాఖ్యలు,అమరావతిపై పుస్తకాలు,రాజధానిలో దీక్షలు పుట్టుకొచ్చాయన్నారు శివాజీ.ఏపీకి వచ్చిన కంపెనీలు ఎన్ని? పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎన్ని? అంటూ విపక్ష నేతలు ప్రశిస్తున్నారని,మరి ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలతో దేశానికి తెచ్చిన కంపెనీలు ఎన్ని?...వచ్చిన పెట్టుబడులు ఎంత?...అని ప్రశ్నించారు.తిరుపతిలో యూనిట్ పెట్టాలని యాపిల్ కంపెనీ ముందుకు వచ్చిందని కానీ వారి ప్రతినిధులు ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్లినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి మహారాష్ట్రకు తీసుకెళ్లటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.నయవంచనకు,నమ్మక ద్రోహానికి కేరాఫ్ అడ్రస్ గా కేంద్రం మారిందన్నారు.