TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శివాజీకి, బీజేపీకీ సంబంధం లేదట...

Published on: Tue Mar 31, 2015 4:53PM

 

సినీ నటుడు శివాజీ బీజేపీలో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అనేక విషయాల్లో బీజేపీ ప్రతినిధిగా ఆవేశంగా, ఆవేదనగా కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా, తన వెనుక బీజేపీ వుందన్న ధైర్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ తాను అయి తీరుతానని నమ్మకంగా ప్రచారం కూడా చేసుకున్నారాయన. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, శివాజీ ప్రస్తుతం బీజేపీలో లేరట... శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకుడు సోము వీర్రాజు ఢిల్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో నటుడు శివాజీ పదేపదే ప్రకటనలు చేస్తూ మీడియాకి ఎక్కుతున్నారని, అయితే బీజేపీకి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన చేసే ప్రకటనలను ఆయన వ్యక్తిగత ప్రకటనలుగా భావించాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు.