శివాజీ కేసులో మరో ట్విస్ట్....పోలీసుల మీద కేస్ వేసిన శివాజీ ?

 

సినీ నటుడు శివాజీని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపిన విషయం తెలిసిందే. టీవీ9 వివాదంలో అలంద మీడియా సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. 

అయితే శివాజీ మాత్రం ఓ వీడియో రిలీజ్ చేసి పోలీసులు అక్రమ కేసులు పెట్టారని తనకు, రవిప్రకాష్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై ఇతరులు కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆజ్ఞాతంలోనే ఉన్నారాయన. రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయినా ఈయన హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఆయన హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయి. అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే ఈ విషయంలో ఇంతకు ముందే కోర్టుకు వెళ్ళిన శివాజీ తనవద్దనున్న కోర్టు ఆర్డర్ ను చూపారని, దీంతో కోరు ఆర్డర్ గురించి తమకి తెలీదని చెప్పినట్టు సమాచారం. కోర్టు ఆర్డర్ గురించి తమకు తెలియదని, మైహోమ్‌ ఒత్తిడితోనే ఈ పని చేశామని పోలీసులు కాళ్ళావేళ్ళా పడ్డారని అయినా వినని శివాజీ పోలీసులపై కోర్టుధిక్కార కేసు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉంది అనేది త్వరలో తేలనుంది.