వర్మ దర్శకత్వంలో అంకుశం
Published on: Tue Dec 17, 2013 3:49PM

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నటుడు రాజశేఖర్ హీరోగా, ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇటీవలే వర్మ చెప్పిన కథ విని, వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. ఇందులో రాజశేఖర్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలిసింది. అదే విధంగా మంచు విష్ణు హీరోగా వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మరి ఈ రెండు సినిమాలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్ళనుందో త్వరలోనే తెలియనుంది.


