వైసీపీలో చేరిన మరో తెలుగు యాక్టర్..!!
Published on: Mon Aug 6, 2018 3:37PM
.jpg)
గతంలో వైసీపీ నుండి పలువురు నేతలు, కార్యకర్తలు అధికార పార్టీ టీడీపీలో చేరారు.. దీనికి తోడు టీడీపీకి మొదటి నుండి సినిమా వాళ్ళ సపోర్ట్ మెండుగా ఉంది.. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా కొందరు సినిమా వాళ్ళు చేరుతున్నారు.. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, కమెడియన్ పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు లాంటి వారు ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు.. తాజాగా ఆ లిస్ట్ లో యాక్టర్ కృష్ణుడు చేరారు.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న కృష్ణుడు ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణుడు, సామాన్య కార్యకర్తగా వైసీపీ గెలుపుకోసం, జగన్‌ను సీఎం చేయడానికి కష్టపడతానని అన్నారు.. జననేత పోరాట పటిమ నచ్చిందని అందుకే వైసీపీలో చేరినట్లు తెలిపారు.



