TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అజ్ఞాతం వీడిన నటి అంజలి

Published on: Sat Apr 13, 2013 2:36PM

 

 

 

 

ఐదు రోజుల నుంచి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా సినీ నటి అంజలి శుక్రవారం హైదరాబాద్ పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యింది. డీసీపీ సుధీర్ బాబు నటి అంజలి ని దాదాపు రెండు గంటలు ప్రశ్నించారు. అన౦తరం మీడియాతో మాట్లాడిన అంజలి..మానసిక ఒత్తిడితోనే తాను బయటకి వెళ్లానని చెప్పారు. సోమవారం నుంచి షూటింగ్ లకు హాజరవుతానని స్పష్టం చేశారు. బాబాయి,పిన్ని గురించి మీడియాకు చెప్పడానికి అంజలి నిరాకరించారు.



మరో వైపు ఆమె పిన్ని భారతి మద్రాస్ కోర్టులో తన కుమార్తెను తనకు తిరిగి అప్పగించవలసిందిగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఆమెను తామే పెంచాము గనుక ఆమెపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని అందువల్ల ఆమెను తమకే క్షేమంగా అప్పగించవలసిందిగా తన పిటిషన్లో కోరింది.