TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి..పోలీసులకు టీడీపీ నేతల వినతి..!

Published on: Fri Jul 10, 2026 7:17PM

 

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా (UAPA) చట్టాన్ని హేళన చేసే విధంగా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉండటమే కాకుండా, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. 

ఇటువంటి వ్యాఖ్యలు చట్టాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఉన్నా యని, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహ రించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికా దని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై సంబంధిత చట్టాల ప్రకారం తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన విజయవాడ వన్‌టౌన్ పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, పోలీసుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.