TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్కోసారి యాక్షన్‌...మరోసారి రియాక్షన్‌ ఏమిటీ లగడపాటి?

Published on: Mon Jul 9, 2012 12:38PM

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ ఎవరికీ అర్థం కావటం లేదు. ఆయన ఒక్కోసారి యాక్షన్‌ చేస్తున్నట్లు, మరోసారి రియాక్షన్‌లాగానూ ప్రవర్తిస్తుంటారు. ఈయన ఎవరికీ అంత తొందరగా అర్థం కావటం లేదని రాజకీయనేతలు అంటున్నారు. అయితే ఒక్కవిషయం మాత్రం అందరికీ అర్థమైంది. లగడపాటి కాలీకాలని నిప్పులా ఫైర్‌ అయి సైలెంట్‌ కూడా అయిపోతుంటారు. ఈ భిన్న మనస్తత్వాలు రాజకీయంలో రాణించాలనుకునే వారికి అవసరమే కానీ, ఎదిగిన నేతల్లో ఉంటే అది ఒకరకంగా ఉపయోగపడుతుంది. లగడపాటి ఇంకా ఎదగాలనుకుంటూ తానే మొత్తం కాంగ్రెస్‌ పార్టీ అని ఫీలయ్యి మరీ రియాక్షన్‌ ఇస్తుంటారు. పక్కా సమైక్యవాది మార్కు కొట్టేసేందుకు తెలంగాణావాదాన్ని వ్యతిరేకించటం వరకూ సమంజసమే కానీ, అక్కడి అన్ని సమస్యల్లోనూ, ఘటనల్లోనూ జోక్యం చేసుకోవాలనుకుంటే మాత్రం తెలంగాణావాదులు ఆయనపై చిరాకుపడుతున్నారు.

 

తాము ఏమైనా ఆరోపణలు చేసినప్పుడు మాట్లాడాల్సిన లగడపాటి ఎవరూ స్పందించరని భావించే సమస్యకు తానే కాంగ్రెస్‌ అయినట్లు సమాధానమిస్తారు. ఇటీవల ఉప ఎన్నికల జోస్యం చెప్పేసి సంచలనం సృష్టించిన అంతటితో ఆగకుండా పరకాల నియోజకవర్గం గురించి సరైన సమాచారాన్నే గుర్తించారు. అసలు తెలంగాణావాదానికి పరకాల ఎన్నికలు పరీక్ష అనుకున్న వారికి లగడపాటి కళ్లు తెరిపించారు. దీంతో ఆగకుండా లగడపాటి ఎక్కడ తెలంగాణావాదులు కనిపించినా యాక్షన్‌తో పని లేని రియాక్షన్స్‌ ఇవ్వటం మొదలుపెట్టారు.

 

తాజాగా తెలంగాణాలో వైద్యసీట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణా న్యాయవాదులు ఆరోపించారు. వీరు ఏకంగా లగడపాటి ఇంటిని ముట్టడిరచేందుకు ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కారు. యాక్షన్‌ ఉంటేనే రియాక్షన్‌ ఇస్తే బాగుంటుందన్న న్యూట్రన్‌ సూత్రాన్ని లగడపాటి ఇకనైనా నమ్మాలని పలువురు కోరుతున్నారు.