TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎకరం @రూ.800 కోట్లు

Published on: Fri Sep 12, 2025 4:53PM

ఎకరం మహా రూ. కోట్లు పలికితే ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ కోకాపేటలో గతంలో ప్రభుత్వ భూముల వేలం సందర్బంగా ఎకరం వంద కోట్ల రూపాయలు పలికితే  అందరూ గుడ్లు తేలేశారు. భూముల ధరలకు రెక్కలు అంటూ నెలల తరబడి మాట్లాడుకున్నారు. అది అంతా గతం ఇప్పుడు ఏకంగా ఎకరం 800 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఎక్కడో తెలుసా?  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. ఔను ముంబైలోని ఒక ప్రాంతంలో ఎకరం దాదాపు 800 కోట్ల రూపాయల చొప్పున 4,16 ఎకరాల భూమిని అక్షరాలా 3 వేల 472 కోట్ల రూపాయలకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది.

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నామిమన్ పాయింట్ లో ఈ భూమిని రిజర్వ్ మ బ్యాంక్ ఆఫ్ ఇ     ండియా కొనుగోలు చేసింది.  ఈ లాండ్ పర్చేజ్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ముంబైలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీడ్ అని చెప్పవచ్చు. ఇంతకీ నారీమన్ పాయింట్ లో ఈ భూమిని ఆర్బీఐ తన కొత్త కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కోనుగోలు చేసింది. ముంబైలో నారిమన్ పాయింట్ ప్రైమ్ బిజినెస్ ఏరియా. 1970ల నుంచీ ఈ ప్రాంతం బిజినెస్ హబ్ గా కొనసాగుతోంది.