TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ కాన్వాయ్ కి ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం

Published on: Sat Mar 4, 2023 10:56AM

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో యాక్సిడెంట్ జరిగింది.  . సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం రేవంత్ రెడ్డి  కాన్వాయ్‌లోని కార్లు అతివేగంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే కార్లలోనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో  పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసమయ్యాయి.

కొంతమంది  విలేకరులు గాయపడ్డారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.