TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

Published on: Wed Apr 15, 2026 9:35AM

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టింది.  ఈ ప్రమాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.   కాగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

 మంగళవారం (ఏప్రిల్ 14) సాయంత్రం సమయంలో  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేదప్రకాశ్ రెడ్డి తన కుటుంబంతో కలిసి బెంగళూరుకు కారులో బయలుదేరారు. కారులో ఆయన భార్య హిమబిందు, రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ రెడ్డి, సోదరుడు దుర్గాప్రసాద్ రెడ్డి, సోదరుడి భార్య శ్రీజ ప్రయాణిస్తున్నారు. పెద్దఅంబర్‌పేట దాటి అబ్దుల్లాపూర్మెట్ ఔటర్ రింగ్ రోడ్డుపై   ప్రయాణిస్తుండగా, ముందుగా మొక్క లకు నీరు పోస్తూ నెమ్మదిగా వెళ్తున్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ  ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయి ట్యాంకర్ కిందకు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో కారు నడుపుతున్న వేద ప్రకాశ్ రెడ్డి   సంఘటనా స్థలంలోనే మరణించారు.  కారులో చిక్కుకున్న మిగిలిన వారిని స్థానికులు, పోలీసులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న చిన్నారి అర్జున్ రెడ్డి మరణించాడు.  ఈ ప్రమాదంలో గాయపడిన హిమబిందు, దుర్గాప్రసాద్ రెడ్డి, శ్రీజల పరిస్థితి  విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  ప్రమాద స్థలాన్ని పరిశీలిం చిన పోలీసులు కారులోని సాంకేతిక ఆధారాల ప్రకారం ప్రమాద సమయంలో కారు గంటకు సుమారు 101 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తు న్నట్లు నిర్ధారించారు. వేగ పరిమితి మించడం, ఫాస్ట్ లేన్‌లో నెమ్మదిగా వెళ్తున్న మెయిం టెనెన్స్ వాహనాన్ని గమనిం చకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కార ణాలుగా భావిస్తున్నారు.