కువైట్ లో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు ఇండియన్స్ దుర్మరణం
Published on: Wed Jul 10, 2024 9:26AM
కువైట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. సెవెన్త్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఓ కంపెనీలో పని చేస్తున్న కార్మికులు.
వీరు ప్రయాణిస్తున్న వాహనం అబ్దుల్లా అల్ ముబారక్ కు ఎదురుగా ఉన్న సెవెన్త్ రిండ్ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారన్నది తెలియాల్సి ఉంది.


