TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబూ సలీంకు ఏడేళ్ల జైలు

Published on: Fri Jun 8, 2018 2:52PM

 

ఒక వ్యాపారిని డబ్బు కోసం బెదిరించిన కేసులో ముంబై గ్యాంగ్‌స్టర్ అబూసలీంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది. 2002లో అబూ సలీం, అశోక్ గుప్తా అనే వ్యాపారిని ఐదు కోట్లు దుబాయికి పంపమని, లేకపోతే అతని కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అయితే ఈ ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేసిన గుప్తా, వాటి ఆధారంగా కేసు నమోదు చేయడంతో సలీం మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం వచ్చింది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో పనిచేసిన అబూ సలీం, తర్వాత కాలంలో విడిపోయి తన సొంత దందాని మొదలుపెట్టాడు. 2005లో పోలీసులకు పట్టుబడిన దగ్గర్నుంచీ వేర్వేరు కేసులలో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. వాటికి ఇప్పుడు మరో శిక్ష కూడా తోడయ్యింది.