ఐసిస్ నాయకుడు అబు బాకర్ అల్-బాగ్దాదీ బతికే ఉన్నాడు..!
Published on: Sat Jul 22, 2017 12:02PM

ఐసిస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు అబు బాకర్ అల్-బాగ్దాదీ చనిపోయాడన్న వార్తలు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరియాలోని రఖ్ఖా ప్రాంతంలో ఐసిస్ స్థావరాలపై ఇటీవల తాము నిర్వహించిన వైమానిక దాడుల్లో అల్ బాగ్దాదీ కూడా హతమై ఉంటాడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అభిప్రాయపడుతోంది. అయితే అమెరికా మాత్రం అబు బాకర్ అల్-బాగ్దాదీ జీవించే ఉండొచ్చునని అంటుంది. `నాకు తెలిసి బాగ్దాదీ బతికే ఉన్నాడు. మా చేతుల్తో మేం చంపే వరకు అతను చనిపోయాడన్న విషయాన్ని నేను నమ్మను` అని జిమ్ వ్యాఖ్యానించారు.


