బీజేపీకి షాకిచ్చిన సర్వే.. కాంగ్రెస్ దే గెలుపు..!!

 

2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ని దెబ్బ తీసింది.. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.. గత కొంతకాలంగా బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. మరోవైపు మిత్రపక్షాలు కూడా కొన్ని బీజేపీకి దూరమయ్యాయి.. ఇవన్నీ కాంగ్రెస్ పాలిట వరంలా మారుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవి పొందటం కాదు, మోదీకి ప్రధాని పదవి అందకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. దానిలో భాగంగానే ప్రాంతీయ పార్టీలకు దగ్గరవుతుంది.. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గడ్‌ రాష్ట్రాలలో ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే నిర్వహించింది.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.. రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 130 స్థానాలు, ఛత్తీగఢ్‌లో 90 స్థానాలకు గాను 54 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 117 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది.. ఈ సర్వేతో కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం పెరుగుతుందేమో.