TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబార్ష‌న్ నిర్ణ‌యం హ‌క్కు మ‌హిళ‌లకే ...సుప్రీం

Published on: Thu Sep 29, 2022 4:33PM

వివాహితులు, అవివాహితులు అబార్ష‌న్  వారి ఇష్టాయిష్టాల‌మీద ఆధార‌ప‌డి ఉండాల‌ని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ‌హిళ‌ లు అంద‌రికీ అబార్ష‌న్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ఉంద‌ని సుప్రీం కోర్టు గురు వారం మెడిక‌ల్ ట‌ర్మినేష‌న్ కేసులో తీర్పు ను వెలువ‌రిస్తూ సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోం దని సుప్రీం పేర్కొంది.

మణిపూర్కు చెందిన 25 ఏళ్ల యువతి 24 వారాల గర్భవతి. సహజీవనం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోవ డానికి నిరాకరించడంతో  ఆమె అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టుకు వెళ్లింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో సవరించిన ఎంటీపీ చట్టంలోని నిబంధ నలతో సెక్షన్ 3కి వివరణలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదం ఉందని గుర్తుచేసింది. ఇది పెళ్లి కాని వారికి కూడా వర్తించేలా.. చట్టసవరణకు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బల వంతంగా కలిసినా  కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అది  బలవంతపు గర్భ ధారణ కిందకు వస్తుందని తెలిపింది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎంటీపీ చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది.