లగచర్ల భూ సేకరణ రద్దు
Published on: Fri Nov 29, 2024 1:12PM
లగచర్ల భూసేకరణ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 580 మంది రైతులు 636 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వంతొలుత నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం రద్దు చేసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీసుకున్న ప్రజాభిప్రాయం వివాదాస్పదమైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇదే కేసులో అరెస్టయ్యారు.


