Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీ కార్యాలయం వద్ద అనుమానాస్పద కారు
posted on: Aug 16, 2022 5:54PM
తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నికల హడావుడితో రాజకీయ పార్టీల హడావుడి రోజు రోజుకీ పెరుగుతోం ది. నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు విసురుకుంటూ రాజకీయాలను వేడె క్కిస్తున్నారు. రాష్ట్రంలో మూడు ముఖ్యపార్టీలు టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ కొత్త కొత్త వ్యూహాలతో మును గోడులో విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏది కనిపించినా కూడా అనుమానాస్ప దంగా చూడాల్సి వస్తోంది. నేడు బీజేపీ ఆఫీస్ ఎదుట ఒక కారు కనిపించింది.
మహారాష్ట్ర నంబర్‌తో రెండ్రోజులుగా నానో కారు అక్క డే ఉంటోంది. నానో కారులో పెద్ద సూట్‌కేసును సైతం బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. ఇంకే ముంది? ఏదో జరిగిపోతోందంటూ రచ్చ రచ్చ. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్‌తో సహా పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద వాలిపోయారు.
క్షణాల్లో మీడియా కూడా బీజేపీ కార్యాలయం వద్దకు చేరిపోయింది. ఏం జరుగుతుందో ఏమోనన్న ఉత్కంఠ. కారులోని సూట్ కేసులో బాంబ్ ఉంటుందన్న అనుమానం. అయితే కారులో ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికే బీజేపీ కార్యాలయం ముందు పార్క్ చేసిన కారుకు సంబంధించిన ఓనర్ వచ్చారు.
ట్విస్ట్ ఏంటంటే.. కారులో ఉన్న సూట్ కేస్‌లో బట్టలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. బీజేపీ కార్యా లయం పక్క కాలనీలో ఉండే వ్యక్తి ఇక్కడ కార్ పార్క్ చేశాడని నిర్దారణ అయింది. ఇన్వెస్టగేషన్ కోసం కారును, కారు ఓనర్‌ను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ పార్క్ చేయడానికి కారణాలు, ఏమైనా కుట్ర ఉన్న దా అనే కోణంలో అనుమానంతో కారు ఓనర్‌ను విచారించారు.






