ఆరుషి డెత్ మిస్టరీ... సంచలన తీర్పు...

 

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 సంవత్సరాలకు ఆరుషి హ‌త్య కేసులో అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 2008, మే 16న  జరిగిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులనే దోషులుగా భావించి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు ఘజియాబాద్‌లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. పనిమనిషి హేమరాజ్‌తో కలిసి ఆరుషి తల్లిదండ్రులు నుపూర్ తల్వార్, రాజేష్ తల్వార్‌ ఆమెను హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెప్పింది. దీంతో ఈ కేసులో వీరిద్దరికీ జీవిత ఖైదు పడింది. ఆ తర్వాత వారు ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసును విచారించిన హైకోర్టు.. వారిని నిర్దోషులుగా తేలుస్తూ సంచలన తీర్పు నిచ్చింది. స‌రైన ఆధారాలు లేవ‌ని చెబుతూ వారిని నిర్దోషులుగా పేర్కొంది. దీంతో ఇప్పుడు మ‌రి ఆరుషిని హ‌త్య చేసిందెవ‌రు? అనే ప్ర‌శ్న మిస్ట‌రీగానే మిగిలిపోయింది.