TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్తి అగర్వాల్ మృతి

Published on: Sat Jun 6, 2015 3:52PM

 

ప్రముఖ తెలుగు సినీ నటి ఆర్తి అగర్వాల్ శనివారం ఉదయం అమెరికాలోని న్యూజెర్సీలో గల ఆట్లాంటిక్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 31. ఆమె గుండె పోటుతో మరణించినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. ఆమె 2001 సం.లో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తన విజయ ప్రస్తానం మొదలుపెట్టి వరుసగా నువ్వు లేక నేను లేను , అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, బాబీ, వీడే, అడవి రాముడు, అందాల రాముడు, నేనున్నాను, చత్రపతి, నరసింహుడు, సోగ్గాడు, సంక్రాంతి, గోరింటాకు వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో ప్రముఖ హీరోల సరసన నటించారు.

 

కానీ ఆమె ఉజ్వల్ అనే యన్.ఆర్.ఐ.తో జరిగిన ఆమె వివాహం విఫలం అయిన తరువాత ఆమె జీవితం ఒక ట్రాజడీ సినిమాలా మారిపోయింది. వివాహానికి ముందు వరకు ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలినప్పటికీ వివాహం విఫలమయిన తరువాత ఆమెను సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. దానితో ఆమె చిన్నచిన్నసినిమాలకే పరిమితమయింది. కానీ అవీ హిట్ అవకపోవడంతో ఆమెకు ఆ సినిమా అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అప్పటికే జీవితంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొన్న ఆమె దానితో మరింత క్రుంగిపోయింది. బహుశః ఆ కారణంగానే ఆమె బరువు కూడా పెరిగిపోయి ఉండవచ్చును.

 

లైపో సక్షన్ సర్జరీ ద్వారా బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమె అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ సర్జరీ విఫలమయినందునే ఆమె మరణించి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ గుండెపోతూ కారణంగానే ఆమె మరనించినట్లు ఆమెమేనేజర్ తెలిపారు. ఏమయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఎంతగానో రంజింప జేసినా ఆర్తి అగర్వాల్ ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం.