TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కరకురాని ఆరోగ్య  పథకాలు! ఏపీలో మరీ ఘోరాలు... 

Published on: Sat Jun 26, 2021 7:16PM

అక్కరకు రానీ ఆరోగ్య పథకాలు మాకు ఎందుకు? పనికి రాని మొగుడు పక్కలో ఉంటేనేమి?ఎక్కడ ఉంటె ఏమిటి? అన్నట్లుగా తయారయ్యింది ఆరోగ్య పధకాల తీరు. అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు నిధులు జాస్తి పథకం అమలు నాస్తి అన్నట్లుగా  ఉంది దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పరిస్తితి మరీ దారుణం గా ఉంది. అసలుఏ పథకమైనా  అక్కరకు  వచ్చినప్పుడే గా రంగు బయట పడుతుంది అంటారు. అలాగే ప్రభుత్వాలు అధికారం లో లేనప్పుడు ఆరోగ్య పధకం అంటూ గొప్పలు చెప్పుకున్న ఆరోగ్యశ్రీ, ముఖ్య మంత్రి సహాయ నిధి కింద ఇచ్చే ఆర్ధిక సహాయం నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీలు వాస్తవానికి అవసరం వచ్చే సరికి పడక వేశాయి. 

ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా వచ్చిన ఆరోగ్య శ్రీ పధకం,కోవిడ్ సమయం లో అక్కరకే రాకుండా పోయింది.  ఆతరువాత వచ్చిన ఇతర దీర్ఘ కాలిక సమస్యలకు  చికిత్స తీసుకుందామంటే అసలు ఆరోగ్యశ్రీని పరిగణలోకి తీసుకోవడం లేదు  కార్పోరేట్ ఆస్పత్రులు. దీంతో ఎక్కడికి వేళ్ళాలో ఎలా చికిత్స చేసుకోవాలో తెలియక సామాన్యుడు  తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. తిందామంటే  తిండే లేదు,చేద్దామంటే పని లేదు, బతకాలంటే వైద్యం లేదు అని లోలోపల కుమిలి పోతున్నారు. 

ఆరోగ్యశ్రీ లో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చికిత్స ఉచితం ఉచితం అంటూ చెప్పిన జగన్ సర్కార్ వాటినిఅమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది.వడ్డించే వాడు మనవాడే అయితే కడ బంతిలో కూర్చున్న మనకు రావాల్సింది వస్తుందని పూర్తిగా నమ్మే తెలుగు ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. ముందు డబ్బు పెట్టుజున్న తరువాత ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి  పలుకుబడితో తెచ్చుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వాస్తవాన్ని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాను . అక్కడ కూడా బ్రోకర్లు,కమీషన్ ఏజంట్లు తిష్ట వేసుకు కూర్చోవడంతో ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చే ఆర్ధిక సహాయం కూడా బాధితులకు అందడం లేదు. సాయం వస్తుందన్న నమ్మకంతో అప్పు చేసి తెచ్చిన డబ్బుఎలా తీర్చాలో అర్ధం కాక తీవ్రమన స్థాపానికి గురవుతున్నారు. ఇది సామాన్యుడే కాదు ఒక ప్రముఖ పాత్రికేయుడికి కుడాఈ పరిస్థితే ఎదురైందంటే ఆరోగ్య శ్రీ అమలు ఎలా ఉందో ఊహించవచ్చు.

సీఎం సహాయనిధి ఇప్పిస్తానని ఆ జర్నలిస్టుకు ఏ నేత హామీ ఇచ్చాడట. దీంతో అతను హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నాడు. అంతదాకా ఎందుకు నేనే ఇస్తానంటూ వాగ్దానం చేసాడు సదరు నాయకుడు ఇంకేముంది సహాయం వచ్చినట్టే అని భావించారు. ఇప్పటికి ఆరునెలలు దాటినా ఆ సదరు పాత్రికేయుడి ఫైల్ ఎక్కడుందో తెలియడం లేదట. సహాయ నిధి లేదు, సాయం చేస్తానన్న మనిషీ లేడు. అడిగితే జవాబు చెప్పే నాధుడు కరువయ్యారు. ఇక తెలంగాణలోను ఇదే పరిస్థితి అటు ప్రధాని భీమా యోజన, ప్రధాన మంత్రి సహాయనిది ఇదే పరిస్థితి. అక్కరకు రాని ఎన్ని ఉంటె ప్రయోజనం ఏముంది, అవి ఉపయోగంలో లేనప్పుడు ఆ పథకాన్ని దప్పుకొట్టి మరీ చెప్పుకోవడం దేనికి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఏ ఆరోగ్య పథకం అయినా ఎన్నికల స్టంట్ గా వచ్చేవే అని మనం అర్ధం చేసుకోవాలి. తమకు అంటే ప్రభుత్వ పెద్దలకు మేలుచేయని వాటికీ ఓట్లు రావని భావించి అరకొర నిధులు ఇచ్చి దులుపుకోడమంటే కుదరదు. కోవిడ్ సమయంలో అటు ముఖ్య మంత్రులకు ఇటు ప్రధాన మంత్రి సహాయ నిధికి వెళ్లువెత్తిన విరాళాల వివరాలను బయపెట్టాలి. సంవత్సరకాలంగా ఏ పథకానికి ఎంత మేర నిధులు ఇచ్చారో వివరించాలి. ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అక్కరకు రానీ పధకాలు మాకెందుకు? చని పోయిన తరువాత ఇచ్చే ఎక్స్ గ్రేషియా లో సైతం ఇవ్వని ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గు సిగ్గు. అయ్యా అసలు మీ పధకాలు అమలు కానప్పుడు ఆశాఖ ఎందుకు మూసేయండి...