TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ పార్టీ లీడర్ మర్డర్

Published on: Mon Dec 28, 2015 10:05PM

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన గల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ధీరేంద్ర ఈశ్వర్ ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యాడు. ధీరేంద్ర ఈశ్వర్ ఇటీవల ఢిల్లీలో యోగా కేంద్రాన్ని స్థాపించాడు. అయితే యోగా కేంద్రాన్ని స్థాపించిన స్థలం విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. సోమవారం నాడు ఆయన తన ఇంటి సమీపంలోనే శవంగా మారి కనిపించడంతో కలకలం రేగింది. ఆయనను దుండగులు దారుణంగా హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.