కేజ్రీవాల్ కు షాక్.. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ వేటు...

 

గత కొద్దికాలంగా ఆప్ నేతలపై ఎలాంటి ఫిర్యాదులు, ఎలాంటి కేసులు లేవని అనుకుంటుండగానే మరో సారి ఆప్ పార్టీకి గట్టి షాకే తగిలింది.  కేంద్ర ఎన్నికల సంఘం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది. ఆప్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ఈసీ పేర్కొంది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. వీరంతా పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపింది. కాగా 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో 66 మంది ఆప్ కు చెందినవారే ఉన్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడ్డా కేజ్రీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఒకవేళ ఈ 20 మందిని రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటిస్తే... ఈ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది.