TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు-కుమార్ విశ్వాస్

Published on: Sun May 7, 2017 7:19PM

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతిపరుడంటూ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు బాసటగా నిలిచారు కుమార్ విశ్వాస్. అరవింద్ నాకు 12 సంవత్సరాలుగా తెలుసు..ఆయన లంచం తీసుకున్నారంటే కనీసం శత్రువులు కూడా నమ్మరు. బహిరంగంగా సీఎం కేజ్రీవాల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ కార్యకర్తలను కూడా ఎంతో బాధించాయన్నారు. మరోవైపు కపిల్ శర్మ చేసిన ఆరోపణలు బీజేపీ, కాంగ్రెస్‌‌లకు అస్త్రంగా దొరికాయి. కేజ్రీవాల్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని..ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.