‘పీకే’ కొత్త పోస్టర్... అమీర్‌ఖాన్ ఒంటిమీద బట్టలున్నాయ్...
Published on: Wed Aug 20, 2014 5:55PM

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా చిత్రం ‘పీకే’ పోస్టర్ని ఆమధ్య విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒంటిమీద బట్టల్లేకుండా ‘అక్కడ’ కేవలం ఓ పాత టేప్ రికార్డర్ మాత్రమే పెట్టుకుని కనిపించి అల్లకల్లోలం చేశాడు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని సమాధానమిచ్చాడు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్ బుధవారం నాడు ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్ ఎంత సంచలనం సృష్టిస్తుందో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్టర్‌లో అమీర్ ఖాన్ ఒంటి నిండా బట్టలు కప్పుకుని వుండి మళ్ళీ జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు.ఈసారి పోస్టర్లో ట్రాన్సిస్టర్ కూడా వుండదని అంటే జనాలు ఏవేవో ఊహించుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఈ పోస్టర్ వుంది.. నిజమే ఈసారి అమీర్ చేతిలో ట్రాన్సిస్టర్ కూడా లేదు. నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం బూర చేతిలో పట్టుకుని నిలుచున్నాడు.


