TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాలుగు రోజుల్లో 10లక్షల మంది ఆమాద్మీ సభ్యత్వం

Published on: Wed Jan 15, 2014 8:39AM

 

జనవరి 10నుండి 26వరకు దేశవ్యాప్తంగా300 జిల్లాలో “నేను కూడా సామాన్యుడినే” అనే నినాదంతో సాగుతున్నఆమాద్మీ పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియలో గత నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 10లక్షల మంది సభ్యులు పార్టీలో చేరారు. నిర్ణీత గడువులోగా కోటి మంది సభ్యులను చేర్చుకొని పార్టీని దేశ వ్యాప్తంగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సభ్యత్వ నమోది ప్రక్రియ అంతటినీ పర్యవేస్తున్న ఆమాద్మీపార్టీ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలియజేసారు.

 

తమ పార్టీకి మహారాష్ట్ర, హర్యాన, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రజలనుండి మంచి ప్రతిస్పందన వస్తోందని ఆయన తెలిపారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో తమ పార్టీకి విపరీతమయిన ఆదరణ దొరుకుతోందని ఆయన తెలిపారు. ఈ ఊపుతోనే దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు.