రాహుల్ గాంధీ పై ఆమ్ ఆద్మీ పోటీ?
Published on: Thu Dec 12, 2013 5:50PM

ఢిల్లీ ఎన్నికలలో సంచనాలు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాహుల్ గాంధీ పై పోటీకి దిగనుంది. ఢిల్లీ లో అగ్రనేతగా ఎదిగిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై పోటీ చేసి..ఆమెను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాహూల్ గాంధీని టార్గెట్ చేయాలని చూస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కి పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహకర్తలో ఒకరైన కుమార్ విశ్వాస్ ను నిలబెట్టాలని కేజ్రివాల్ నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌తో పాటు ఆయా పార్టీల అగ్రనేతల పైన తమ అభ్యర్థులను పోటీకి దింపేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. షీలా దీక్షిత్ లాగే రాహూల్ కూడా ఓ సామాన్యుని చేతిలో పరాజయం పాలైతే ఆయన రాజకీయ జీవితానికే ఎసరు రావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.


