రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... అవసరం లేదు..

రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. రైల్వే టిక్కెట్ల బుకింగ్స్‌కు ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి కాదని భారతీయ రైల్వే ధృవీకరించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో రైల్వేశాఖ సహాయమంత్రి రాజేన్‌ గోహైన్ మాట్లాడుతూ..రైలు ప్రయాణం కోసం టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సినవసరం లేదని, కానీ స్వచ్ఛదంగా దీన్ని సమర్పించడాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆధార్‌ ద్వారా బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు రైల్వే ఇటీవలే ఆధార్‌ ఉంటే నెలలో 12 వరకూ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపినట్టు పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీలో యూజర్‌ ఐడీకి ఆధార్‌ లింక్‌ చేస్తే, రివార్డు స్కీమ్‌ను కూడా ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టినట్టు మంత్రి చెప్పారు.