ఆదార్‌ తప్పసిసరి కాదు

 

కేవలం ఆదార్‌ లేని కారణంగా భారతదేశం ప్రజలకు నిత్యావసారాలను నిరాకరించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యనించింది. ఆదార్ కార్డు పొందాల వద్దా అనేది వ్యక్తి ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుందని దాన్ని తప్పనిసరి నిబందన చేయద్దని స్పష్టం చేసింది. అంతే కాకుండా అక్రమంగా వలస వచ్చి ఈ దేశంలో ఉంటున్న వారికి ఆదార్‌ కార్డులు అందకుండా జాగ్రత్త పడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

జీతాలు, పిఎఫ్‌లు, వివాహ దృవీకరణ, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ లాంటి వాటికి ఆదార్‌ను తప్పనిసరి చేయటం పై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆదాక అమలు పౌరుల ప్రాదమిక హక్కులను హరించేదిగా ఉండరాదని స్పష్టం చేసింది.

ఆదార్‌ తీసుకోవడం వ్యక్తిగత అభిప్రాయం అని కేవలం ఆదార్‌ లేని కారణం వ్యక్తి గుర్తింపు కార్డులు జారీ చేయకుండ ఉండరాదని ప్రభుత్వానికి తెలిపింది.అయితే ఈ విషయం పై వాదనలు వినిపించిన ప్రభుత్వం, ఆదార్‌ తప్పనిసరి కాదని, స్వచ్చందమేనని కోర్టుకు తెలిపింది. ఎటువంటి గుర్తింపు కార్డు లేని అణగారిన వర్గాల కోసమే ఆదార్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది.