ఆధార్ తప్పనిసరి ఏం కాదు...
Published on: Mon Mar 27, 2017 12:39PM
.jpg)
ఆధార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఈరోజు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 30కిపైగా ఉన్న కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సి ఉంటుందని ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని మరోసారి తేల్చి చెప్పింది. కేవలం బ్యాంక్ అకౌంట్లు తెరవడంలాంటి వాటికి ఆధార్‌ను వాడుకోవచ్చని సూచించింది.


