TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అత్తింటి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

Published on: Tue Jul 3, 2018 4:59PM

అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య అని అప్పుడప్పుడు వింటుంటాం.. కానీ ఇప్పుడు అత్తింటి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి చోటు చేసుకుంది.. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాన్ని వెల్లడించాడు.. తనను భార్యతోపాటు అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని.. తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులతో అరెస్ట్ చేయించారని వాపోయాడు.. పోలీసులు తనను రెండు రోజులపాటు నిర్బంధించి వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.. తాను తన భార్య కోసం ఎంతో చేశానని, అది ఆమెకు కూడా తెలుసని.. అయినా తనను వేధింపులకు గురిచేశారని వాపోయాడు.. అలానే తన తల్లితండ్రులకు క్షమాపణలు చెప్పి.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అయితే గురువారెడ్డి ఆత్మహత్యకు అతని భార్య లవ్ ఎఫైర్ కారణమని తెలుస్తుంది.. ఆమె తరుచూ ఓ వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండటంతో, గురువారెడ్డి అత్తింటివారితో తన భార్యని మందిలించమని కోరాడట.. కూతురికి మంచి చెప్పాల్సిన తల్లిదండ్రులు అన్యాయంగా అల్లుడిని అరెస్ట్ చేపించి వేధించినట్టు తెలుస్తుంది.. దీంతో మనస్తాపం చెందిన గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.