Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ ?
posted on: Oct 7, 2024 7:40PM
హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు రీ సర్వే చేసే పనిలో ఉన్నాయి. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి వెంటనే రీ సర్వే చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ రీసర్వే తర్వాత ప్రత్యేక వెబ్ సైట్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళ్లడంతో ఇటీవల హైకోర్టు అక్షింతలు పెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాతే కూల్చివేతల స్పీడ్ తగ్గింది. మూసీ పరివాహక ప్రాంతంలో నోటీసులిచ్చిన వారికి సామరస్యపూర్వకంగా అధికారులు ఖాళీ చేయించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతే కాదు ఆర్థిక సహకారం కూడా అందించింది. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ ప్రతి పక్ష పార్టీల నుంచి ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో రీ సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రీ సర్వే వివరాలను వెబ్ సైట్ లో పెట్టిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది


(2).webp)
.webp)


