TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గిపోతున్న జనాభా... చైనాపై తీవ్ర ప్రభావం

Published on: Fri Jun 12, 2026 5:22PM

 

అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచలో శక్తివంతమైన దేశగా ఎదగాలనుకుంటున్న చైనాకు జనాభానే ప్రతిబంధంగా మారింది. చైనాలో జనాభా తగ్గుదలతో  దేశాభివృద్ధి పడిపోనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా తెలిపారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే చైనా జనాభా మళ్లీ పెరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. జనాభా మళ్లీ పెరిగేందుకు సరిపడా చైనాలో మహిళల సంఖ్య లేదని అన్నారు. కాలం గడిచే కొద్దీ చైనాలో వినియోగదారులు తగ్గిపోయి, మార్కెట్ పడిపోతోందన్నారు. ఐరోపా, జపాన్‌లో మాత్రం జనాభా తగ్గుదల అనేది ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరుగుతోందని చెప్పారు. 

మహిళల సంఖ్య తగ్గిపోయిన కారణంగా చైనాలో తీవ్ర స్థాయి మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు.1980-2016 మధ్య చైనా అనుసరించిన ‘ఏక సంతాన విధానం’ వల్ల జనాభాలో స్త్రీపురుష నిష్ఫత్తి భారీ స్థాయిలో ప్రభావితమైందని నిపుణులు చెబుతున్నారు. ఏక సంతాన విధానానికి తోడు అబ్బాయిలే కావాలన్న తల్లిదండ్రుల భావన, ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు వంటివన్నీ ప్రస్తుత పరిస్థితికి దారితీశాయని చెబుతున్నారు. మునుపటి తరంలో మొదలైన అసమానతలన్నీ తదుపరి తరంలో మరింత తీవ్రంరూపం దాల్చే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 2100 నాటికల్లా చైనా జనాభా సగానికి (633 మిలియన్లు) పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.